తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ట్రాన్స్​జెండర్లపై లైంగిక దాడులు ఆపేదెలా?' - ట్రాన్స్​జెండర్లపై లైంగిక దాడులు సుప్రీం

లైంగిక దాడుల నుంచి ట్రాన్స్​జెండర్లకు.. ఇతరులతో సమానంగా రక్షణ కల్పించాలంటూ దాఖలైన పిటిషన్​పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఇందుకు సంబంధించి చట్టాలు రూపొందించే విషయంపై వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది.

SC seeks Centre's reply on PIL for equal protection of law to transgenders in sexual offences
'లైంగిక దాడులపై ట్రాన్స్​జెండర్లకు చట్టాలేవి?'

By

Published : Oct 12, 2020, 4:49 PM IST

లైంగిక దాడి విషయంలో ట్రాన్స్​జెండర్లకు కూడా సమానంగా రక్షణ కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్​పై స్పందించాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. దీనిని విచారించదగిన కేసుగా అభివర్ణించిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. లైంగిక దాడుల నుంచి ట్రాన్స్​జెండర్లకు రక్షణ కల్పించేందుకు సరైన చట్టాలు లేకపోవడాన్ని గుర్తించింది.

ఇలాంటి విషయాల్లో ఎలాంటి చట్టాలు లేకుండానే తీర్పులు వెలువరించిన కేసుల వివరాలను కోర్టుకు సమర్పించాలని పిటిషనర్​ తరఫు న్యాయవాది వికాస్​ సింగ్​కు త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది.

పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక దాడులకు సంబంధించి రూపొందించిన విశాఖ మార్గదర్శకాలను ఈ నేపథ్యంలో ప్రస్తావించింది అత్యున్నత న్యాయస్థానం. చట్టాలు లేని కారణంగా స్వలింగ సంపర్కుల విషయాన్ని కూడా ఇందులో చేర్చింది.

ఈ కేసులో న్యాయశాఖ, సామాజిక న్యాయం- సాధికారత మంత్రిత్వశాఖను ఇతర పార్టీలుగా పేర్కొన్నారు పిటిషనర్​, న్యాయవాది రీపక్​ కాన్సల్​. ట్రాన్స్​జెండర్లు, ట్రాన్స్​సెక్సువల్స్​, కిన్నర్​, యూనిచ్​లను లైంగిక దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు ఎలాంటి చట్టాలు లేవని వ్యాజ్యంలో పేర్కొన్నారు. వీరిని 'మూడో లింగం'గా అత్యున్నత న్యాయస్థానం గుర్తించినప్పటికీ.. ఐపీసీలో ఎలాంటి నిబంధనలు లేవని వివరించారు. అందువల్ల వారికి కూడా సమాన హక్కులను కల్పించాలని కోరారు.

ఇదీ చూడండి:-'చక్రవడ్డీ మాఫీకి ఓకే.. మారటోరియం పొడిగింపే కష్టం'

ABOUT THE AUTHOR

...view details