భారత నౌకాదళంలో మహిళా అధికారుల శాశ్వత కమిషన్ ఏర్పాటుకు సుప్రీంకోర్టు అనుమతించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను మూడు నెలల్లో రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
మహిళలు పురుషులతో శక్తిసమానులు: సుప్రీం
భారత నేవీలో మహిళా అధికారుల శాశ్వత కమిషన్ ఏర్పాటుపై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. మహిళలు పురుషులతో శక్తిసమానులని వ్యాఖ్యానించింది. లింగవివక్షకు ఆస్కారం ఉండకూడదని స్పష్చం.
మహిళలు పురుషులతో శక్తిసమానులు: సుప్రీం
మహిళలు, పురుషులను సమానంగా చూడాలని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దేశానికి సేవ చేస్తున్న మహిళలకు శాశ్వత కమిషన్‌ను తిరస్కరిస్తే అది న్యాయవ్యవస్ధకు విఘాతం కల్గించే పరిస్ధితికి దారి తీస్తుందని తెలిపింది. నౌకాదళంలో లింగ వివక్ష ఉండరాదని జస్టిస్ వైవీ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. నౌకాదళంలో మహిళలకు శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయకుండా ఉన్న చట్టబద్ధమైన నిషేధాన్ని తొలగించాలని, అప్పుడే వారికి పురుషులతో సమాన హోదా లభిస్తుందని పేర్కొంది.