పౌరసత్వ చట్ట సవరణపై నిరసన పేరిట దిల్లీ షాహిన్‌బాగ్‌లో రహదారులు దిగ్బంధించడం, ఇతరులకు ఇబ్బంది కలిగించడం తగదని అభిప్రాయపడింది సుప్రీంకోర్టు. ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉన్నా... అది నిర్దేశిత ప్రాంతంలోనే చేయాలని హితవు పలికింది.
"ఒక చట్టం తెచ్చారు. దానితో తమకు ఇబ్బందులు ఉన్నాయని ప్రజలు అంటున్నారు. ప్రస్తుతం ఆ వివాదం కోర్టు పరిధిలో ఉంది. అయినా కొందరు నిరసన చేపడుతున్నారు. వారికి ఆ హక్కు ఉంది. కానీ మీరు రహదారులు దిగ్బంధించకూడదు. ఒకే ప్రాంతంలో నిరవధికంగా నిరసన కార్యక్రమం నిర్వహించకూడదు. మీరు నిరసన తెలపాలనుకుంటే... అందుకు నిర్దేశించిన ప్రాంతంలోనే ఆ పని చేయాలి."
-సుప్రీంకోర్టు