పౌరసత్వ సవరణ చట్టం చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణకు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన 143 పిటిషన్లను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. సీఏఏపై స్టే విధించేందుకు నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వ వాదనలు వినకుండా చట్టం అమలును నిలుపుదల చేయలేమని స్పష్టం చేసింది. ఈ చట్టంపై ఏమైనా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సి వస్తే నాలుగు వారాల తర్వాత చేస్తామని తెలిపింది. సీఏఏ సవాల్ పిటిషన్లపై కేంద్రం నాలుగు వారాల్లో అభిప్రాయం తెలపాలన్న సుప్రీం.. అప్పటి వరకు సీఏఏకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై ఏ రాష్ట్ర హైకోర్టు కూడా విచారణ జరపరాదని స్పష్టం చేసింది.
సీఏఏపై స్టేకు సుప్రీం నో- రాజ్యాంగ ధర్మాసనానికి కేసు బదిలీ - SC says it may refer pleas challenging CAA to larger constitution bench
పౌరసత్వ సవరణ చట్టంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వ వాదనలు వినకుండా అలా చేయలేమని స్పష్టం చేసింది. సీఏఏకు వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాలను విచారించేందుకు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ పిటిషన్లపై స్పందించేందుకు కేంద్రానికి నాలుగు వారాల గడువిచ్చింది.
సీఏఏకు వ్యతిరేకంగా ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్, కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ సహా 143 మంది సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. 143 పిటిషన్లలో 60 ప్రతులను కేంద్ర ప్రభుత్వానికి అందజేసినట్లు అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ ధర్మాసనానికి తెలిపారు. పిటిషన్లపై స్పందించేందుకు మరింత సమయం కావాలని కోరారు. పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్.. పౌరసత్వ సవరణ చట్టం అమలును నిలిపేయాలని, జాతీయ పౌరపట్టిక అమలును వాయిదా వేయాలని ధర్మాసనాన్ని కోరారు.
TAGGED:
Gangadhar Y