తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కోర్టులు ఇప్పట్లో అలా పని చేయడం కష్టమే! - physical hearings news

దేశవ్యాప్తంగా కరోనా విస్తరిస్తోన్న నేపథ్యంలో సాధారణ పద్ధతిలో కేసుల విచారణ చేపట్టడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నాలుగు వారాల తర్వాత అప్పటి పరిస్థితి ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పింది.

SC rules out possibility of conducting physical hearings at present
'భౌతికంగా విచారించే అవకాశం ఇప్పట్లో లేదు'

By

Published : Jul 22, 2020, 5:18 PM IST

కరోనా వ్యాప్తి కొనసాగుతున్న వేళ... సుప్రీంకోర్టులో కేసులను సాధారణ రీతిలో విచారించే అవకాశం ఇప్పట్లో లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నాలుగు వారాల తర్వాత ఈ అంశంపై ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.

వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగ పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు కోటా మంజూరు చేసే అంశంపై వర్చువల్​ విచారణకు బదులు సాధారణ పద్ధతిలో విచారణ చేపట్టాలని ఓ న్యాయవాది కోరగా.. సుప్రీంకోర్టు ఈ మేరకు స్పందించింది.

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ప్రారంభం కాక ముందు నుంచే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేసుల విచారణ జరుపుతోంది సుప్రీంకోర్టు.

ఇదీ చూడండి:'అంబేడ్కర్​ దూరదృష్టి వల్లే కాగ్​ ఏర్పాటు'

ABOUT THE AUTHOR

...view details