తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశద్రోహం కేసులో జర్నలిస్టు వినోద్ దువా​కు ఊరట - వినోద్​ దువా సెడిషన్​ కేసు

దేశ ద్రోహం కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ ప్రముఖ జర్నలిస్ట్​ వినోద్​ దువా దాఖలు చేసిన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ఆదివారం అత్యవసర విచారణ చేపట్టింది. వచ్చే నెల 6వరకు వినోద్​ను అరెస్టు చేయకూడదని హిమాచల్​ప్రదేశ్​ పోలీసులకు ఆదేశించింది. అయితే దర్యాప్తుపై స్టే విధించడానికి నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం.. విచారణకు సహకరించాలని వినోద్​కు స్పష్టం చేసింది.

SC restrains HP police from arresting Vinod Dua in sedition case, refuses to stay probe
ప్రముఖ జర్నలిస్ట్​ వినోద్​కు సుప్రీంలో ఊరట

By

Published : Jun 14, 2020, 12:12 PM IST

ప్రముఖ జర్నలిస్ట్​ వినోద్​ దువాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. దేశ ద్రోహం కేసులో తనను హిమాచల్​ప్రదేశ్​ పోలీసులు అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలంటూ వినోద్​ దాఖలు చేసిన పిటిషన్​పై సుప్రీం సానుకూలంగా స్పందించింది. ఆదివారం జరిపిన అత్యవసర విచారణలో ఈ మేరకు జులై 6 వరకు వినోద్​ను అరెస్టు చేయకూడదని పోలీసులను ఆదేశించింది.

అయితే దర్యాప్తుపై స్టే విధించాలన్న వినోద్​ అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. దర్యాప్తుకు సహకరించాలని స్పష్టం చేసింది. ఈ విషయంపై రెండు వారాల్లోగా స్పందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది జస్టిస్​ యూయూ లలిత్​, జస్టిస్​ ఎమ్​ఎమ్​ శాంతనగౌదర్​లతో కూడిన​ ధర్మాసనం. తదుపరి విచారణను జులై 6కు వాయిదా వేసింది.

వినోద్​ నిర్వహించిన ఓ యూట్యూబ్​ కార్యక్రమం ఆధారంగా ఆయనపై గతంలో హిమాచల్​ప్రదేశ్​ పోలీసులు దేశ ద్రోహం కేసు నమోదుచేశారు.

ఇదీ చూడండి:-అటార్నీ జనరల్‌గా కేకే వేణుగోపాల్‌ కొనసాగింపు

ABOUT THE AUTHOR

...view details