తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పీఎం కేర్స్ నిధులపై సుప్రీం తీర్పు వాయిదా - pm cares ndrf latest news

కరోనాపై పోరు కోసం పీఎం కేర్స్ నిధి ద్వారా​ సేకరించిన విరాళాలను జాతీయ విపత్తు నిర్వహణ నిధి(ఎన్​డీఆర్​ఎఫ్​)కి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్​పై వాదనలు ఆలకించింది సుప్రీంకోర్టు. అనంతరం తీర్పును వాయిదా వేసింది.

SC reserves order on plea for transferring funds collected in PM CARES to NDRF
పీఎం కేర్స్ నిధులపై సుప్రీం తీర్పు వాయిదా

By

Published : Jul 27, 2020, 5:24 PM IST

పీఎం కేర్స్​ ద్వాారా సేకరించిన నిధులను జాతీయ విపత్తు నిర్వహణ నిధి(ఎన్​డీఆర్​ఎఫ్​)కి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్​ను విచారించింది సుప్రీంకోర్టు. వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వులో పెట్టింది.

పీఎం కేర్స్​ నిధి ద్వారా సేకరించిన విరాళాలు స్వచ్ఛంద నిధుల కిందకు వస్తాయని.. ఎన్​డీఆర్​ఎఫ్​కు నిధులు బడ్జెట్​ ద్వారా సమకూర్చుతారని వాదనల సందర్భంగా కోర్టుకు తెలిపారు కేంద్రం తరఫు న్యాయవాది తుషార్ మెహ్తా.

అయితే పీఎం కేర్స్​ నిధిని విపత్తు నిర్వహణ చట్టం నిబంధనలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేశారని ఎన్జీఓ తరఫున వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే. ఎన్​డీఆర్​ఎఫ్ ఆడిట్​ను కాగ్​ నిర్వహిస్తుందని, పీఎం కేర్స్​ నిధి ఆడిట్​ను మాత్రం ప్రైవేటు ఆడిటర్లు నిర్వహిస్తారని ప్రభుత్వం చెప్పినట్లు కోర్టుకు వివరించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును వాయిదా వేసింది.

ఇదీ చూడండి: గేమ్​ ఛేంజర్​ 'రఫేల్'​ ఎందుకింత ప్రత్యేకం?

ABOUT THE AUTHOR

...view details