తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేసుల కేటాయింపుపై సుప్రీంకోర్టు కొత్త రోస్టర్‌ విధానం - supreme court

కొత్త రోస్టర్‌ను సుప్రీంకోర్టు విడుదల చేసింది. దాని ప్రకారం ప్రజాప్రయోజన వ్యాజ్యాలు, లెటర్‌ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డేతో పాటు సీనియర్‌ న్యాయమూర్తులైన జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ అరుణ్‌మిశ్ర, జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపడుతుంది. త్రివిధ దళాలు, న్యాయాధికారుల వ్యవహారాలు జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ధర్మాసనం పరిధిలోకి వచ్చాయి.

sc-releases-new-roster
కేసుల కేటాయింపుపై సుప్రీంకోర్టు కొత్త రోస్టర్‌ విధానం

By

Published : Nov 30, 2019, 6:00 AM IST

సుప్రీం కోర్టు కొత్త రోస్టర్​ను విడుదల చేసింది. ఈ రోస్టర్​ ప్రకారం.. ప్రజాప్రయోజన వ్యాజ్యాలు, లెటర్​ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​ఏ బోబ్డేతో పాటు.. సీనియర్​ న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ చేపడుతుంది.

ధిక్కరణ, ఎన్నికలు, హెబియస్‌కార్పస్‌, సామాజిక న్యాయం, ప్రత్యక్ష-పరోక్ష పన్నులు తదితర కేసులను జస్టిస్‌ బోబ్డే చూస్తారు. వీటితో పాటూ విచారణ కమిషన్‌లు, కంపెనీ చట్టాలు, ‘ట్రాయ్‌’, ‘సెబీ’, భారతీయ రిజర్వు బ్యాంకు తదితర కేసులు కూడా ఆయన విచారణ పరిధిలోనే ఉన్నాయి.

త్రివిధ దళాలు జస్టిస్​ ఎన్​.వి.రమణ పరిధిలోకి...

జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సారథ్యంలోని ధర్మాసనం త్రివిధ దళాలు, పారామిలిటరీ, నష్టపరిహారం, క్రిమినల్‌, సాధారణ సివిల్‌ అంశాలు, న్యాయాధికారులు, సుప్రీం, హైకోర్టులు, జిల్లా న్యాయస్థానాలు, ట్రైబ్యునళ్ల ఉద్యోగులకు సంబంధించిన కేసులను విచారిస్తుంది.

ఈ కేసులతో పాటు ప్రభుత్వ ప్రాంగణాల నుంచి ఖాళీ చేయించడానికి సంబంధించిన అంశాలనూ విచారిస్తుంది. ఆర్బిట్రేషన్‌ అంశాలను సవాలు చేస్తూ దాఖలయ్యే స్పెషల్‌ లీవ్‌ పిటిషన్లు, వాణిజ్యపరమైన లావాదేవీలు, సాగరచట్టాల పరిధిలోకి వచ్చే అంశాలకు సంబంధించిన కేసులను ధర్మాసనం వింటుంది.

  • జస్టిస్‌ అరుణ్‌ మిశ్ర ధర్మాసనం.. భూసేకరణ, వైద్యకళాశాలల్లో ప్రవేశానికి సంబంధించిన కోటా, చట్టబద్ధ సంస్థల ఉత్తర్వులను సవాలు చేసే అపీళ్లు, విద్యాసంస్థలకు గుర్తింపునకు సంబంధించిన కేసులను చూస్తుంది. వాటితో పాటూ పరోక్షపన్నుల కేసులు, కోర్టు ధిక్కారకేసులు, సాధారణ పౌర కేసులు, ఇంజినీరింగ్‌, వైద్య కళాశాల్లో ప్రవేశాలు, బదిలీలకు సంబంధించిన కేసులను విచారిస్తుంది.
  • జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌. నారిమన్‌ ధర్మాసనం కుటుంబ చట్టాలు, సాయుధ, పారామిలిటరీ దళాల కేసులు, లీజు వ్యవహారాలు, ప్రభుత్వ, స్థానిక సంస్థలు చేసుకునే ఒప్పందాల కేసులు చూస్తుంది.
  • జస్టిస్‌ ఆర్‌ భానుమతి సారథ్యంలోని ధర్మాసనం కార్మిక, అద్దె చట్టాలు, భూ చట్టాలు, తదితర కేసులను చూస్తుంది.

ABOUT THE AUTHOR

...view details