తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీ బయోపిక్​ విడుదలపై జోక్యం చేసుకోలేం'

మోదీ బయోపిక్​ రిలీజ్​ విషయంలో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎన్నికలు పూర్తయ్యేవరకు చిత్రం విడుదలపై నిషేధం విధించిన ఈసీ నిర్ణయంలో కలుగజేసుకోలేమని స్పష్టం చేసింది.

'మోదీ బయోపిక్​ విడుదలపై జోక్యం చేసుకోలేం'

By

Published : Apr 26, 2019, 1:02 PM IST

Updated : Apr 26, 2019, 1:47 PM IST

'మోదీ బయోపిక్​ విడుదలపై జోక్యం చేసుకోలేం'

ప్రధానమంత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'ప్రధాని నరేంద్ర మోదీ' చిత్రం విడుదల వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు సినిమా విడుదలను నిషేధిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయంలో కలుగ జేసుకోలేమని తేల్చిచెప్పింది. నిర్మాతల అభ్యర్థనను ఈమేరకు తోసిపుచ్చింది.

సెన్సార్​ బోర్డు ఒప్పుకున్నా....

వివేక్​ ఒబెరాయ్​ ప్రధాన పాత్రలో నటించిన ప్రధాన నరేంద్రమోదీ చిత్రం ఏప్రిల్​ 11నే విడుదల కావాల్సి ఉంది. సెన్సార్​ బోర్డు అందుకు పచ్చజెండా ఊపింది. అయితే ఎన్నికల వేళ బయోపిక్​ విడుదల సరికాదంటూ విపక్షాలు ఈసీని ఆశ్రయించాయి. తుది దశ పోలింగ్​ పూర్తయ్యే మే 19వరకు సినిమా విడుదల చేయరాదని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీచేసింది.

నిర్మాతల న్యాయపోరాటం..

ఈసీ నిషేధాజ్ఞల్ని సవాలు చేస్తూ చిత్రబృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల సంఘం 2 నిమిషాల ట్రైలర్​ను మాత్రమే చూసి నిర్ణయం తీసుకుందని వాదించింది. స్పందించిన సుప్రీంకోర్టు... పూర్తి సినిమా చూసి, నివేదిక సమర్పించాలని ఈసీని ఆదేశించింది.

ప్రధాన నరేంద్రమోదీ సినిమా చూసిన ఎన్నికల సంఘం అధికారుల బృందం... ఈనెల 22న సుప్రీంకోర్టుకు 20 పేజీల నివేదిక సమర్పించింది. ఒక వ్యక్తిని అసాధారణ రీతిలో కీర్తించేలా ఉన్న ఈ సినిమా ఎన్నికల వాతావరణాన్ని ప్రభావితం చేసే అవకాశముందని పేర్కొంది.

ఈసీ నివేదికను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు... మోదీ బయోపిక్​ విడుదల వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని స్పష్టంచేసింది.

Last Updated : Apr 26, 2019, 1:47 PM IST

ABOUT THE AUTHOR

...view details