తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎన్నికల బాండ్ల జారీపై స్టేకు సుప్రీం నిరాకరణ - ఎన్నికల బాండ్లు

ఎన్నికల బాండ్ల పథకంపై మధ్యంతర స్టేకు సుప్రీం కోర్టు నిరాకరించింది. సరైన దరఖాస్తును సమర్పించాలని పిటిషనర్​కు సూచించింది. బాండ్ల విషయంపై పూర్తి స్థాయిలో విచారణ అవసరమని.. ఈ నెల 10న విచారణ చేపడతామని పేర్కొంది అత్యున్నత న్యాయస్థానం.

ఎన్నికల బాండ్ల జారీపై స్టేకు సుప్రీం నిరాకరణ

By

Published : Apr 5, 2019, 4:08 PM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకంపై మధ్యంతర స్టేకు సుప్రీం కోర్టు నిరాకరించింది. దాని కోసం సరైన దరఖాస్తును సమర్పించాలని పిటిషన్​ దాఖలు చేసిన స్వచ్ఛంద సంస్థను ఆదేశించింది.

ఎన్నికల బాండ్లపై పూర్తి స్థాయిలో విచారణ అవసరమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఎన్నికల సమయం కావున పిటిషన్​పై ఈ నెల 10న విచారణ చేపడతామని తెలిపింది.

ఇదీ చూడండి:భారత్​ భేరి: రికార్డుల కింగ్​ సిక్స్ కొడతారా

95 శాతం బాండ్లు అధికార పార్టీకే

రాజకీయ పార్టీలకు కోట్లాది రూపాయలు అనామకంగా వచ్చి చేరుతున్నాయని ఎన్​జీవో తరఫు న్యాయవాది ప్రశాంత్​ భూషణ్​ ఆరోపించారు. 95 శాతం బాండ్లు అధికార పార్టీకే అందటమేంటని ప్రశ్నించారు.

నల్లధనం అరికట్టేందుకే..

రాజకీయ పార్టీలకు వచ్చే నల్లధనాన్ని అరికట్టేందుకే ఎన్నికల బాండ్ల పథకం ప్రవేశపెట్టినట్లు కేంద్రం తరఫున కోర్టుకు హాజరైన అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్​ తెలిపారు.

ఎన్నికల బాండ్ల పథకం-2018పై స్టే విధించాలని ఎన్​జీవో సంస్థ ఏడీఆర్​(అసోసియేషన్​ ఆఫ్​ డెమోక్రటిక్​ రిఫామ్స్​) సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం గత ఏడాది జనవరిలో ఈ పథకాన్ని ప్రారంభించింది. వీటి వల్ల రాజకీయ పార్టీలకు వచ్చే నిధుల వివరాలలో పారదర్శకత ఉంటుందని పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details