తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిహార్​ ఎన్నికల వాయిదాపై పిటిషన్​ తిరస్కరణ - బిహార్ అసెంబ్లీ ఎన్నికలు

కరోనా నేపథ్యంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్​ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

SC refuses to entertain plea for deferment of Bihar Assembly polls
బిహార్​ ఎన్నికలు వాయిదా వేయాలనే పిటిషన్​ తిరస్కరణ

By

Published : Sep 25, 2020, 12:36 PM IST

బిహార్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్​ను తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. కరోనా నేపథ్యంలో ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం లేదని దాఖలైన వాజ్యాన్ని విచారణకు నిరాకరించింది. అజయ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్​పై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

'ప్రతి ఒక్కరిని ఎన్నికల సంఘం వద్దకు వెళ్లేందుకు అనుమతించబోము, పిటిషన్​ను ఉపసంహరించుకునేందుకే అనుమతిస్తాం' అని విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది జస్టిస్​ అశోక్​ భూషణ్​, జస్టిస్​ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్​ ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం. అనంతరం వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నారు అజయ్​.

ABOUT THE AUTHOR

...view details