తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"ముందు హైకోర్టుకెళ్లండి.. తర్వాత చూద్దాం" - HIGH COURT

ఆధార్ ఆర్డినెన్స్​ను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్​ను వెనక్కి తీసుకోవాలని పిటిషనర్లను ఆదేశించింది సుప్రీంకోర్టు. మొదట హైకోర్టులో తమ వాదనను వినిపించాలని సూచించింది.

సుప్రీంకోర్టు

By

Published : Apr 5, 2019, 1:45 PM IST

ఆధార్​ ఆర్డినెన్స్​ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్​ను దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం తిరస్కరించింది. మొదట హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్లకు సూచించింది.

జస్టిస్​ ఎస్​.ఏ.బోబ్డే, జస్టిస్​ ఎస్​.ఏ.నజీర్​ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు పురోగతిపై ఎటువంటి వాఖ్యలు చేయలేదు. హైకోర్టు అభిప్రాయాన్నే పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.

సీనియర్ న్యాయవాది అభిషేక్​ మను సింఘ్వీ పిటిషనర్ల తరపున ధర్మాసనం ఎదుట వాదనను వినిపించారు. అది జాతీయ ప్రధానమైన అంశమని దీని ద్వారా దేశమంతా ప్రభావం ఉంటుందని తెలిపారు. ఈ అంశాన్ని అత్యున్నత న్యాయస్థానమే పరిష్కరించాలని కోరారు.

అయినప్పటికీ ధర్మాసనం.. పిటిషనర్లు తమ ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని సూచించింది. హైకోర్టు స్థాయిలో పిటిషన్​ను వేసుకునేందుకు వారికి అనుమతినిచ్చింది.

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ మార్చి 3న ఆధార్​ ఆర్డినెన్స్​కు ఆమోదం తెలిపారు. ఇది మొబైల్​ సిమ్ కార్డు తీసుకునేందుకు, బ్యాంకు అకౌంటు తెరిచేందుకు ఆధార్​ను ఇష్టం ఉంటేనే వినియోగించే అవకాశం కల్పిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details