తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్​ ఎన్నికలపై విచారణకు 'సుప్రీం' నిరాకరణ - జస్టిస్​ అశోక్ భూషణ్​ ధర్మాసనం

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేలా సంబంధిత విభాగాలను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఆర్టికల్​ 32 ప్రకారం ఈ అంశంపై తాము విచారణ జరపలేమని స్పష్టం చేసింది.

west bengal assembly polls
బంగాల్​ ఎన్నికల వ్యాజ్యం విచారణకు 'సుప్రీం' నో

By

Published : Jan 25, 2021, 3:04 PM IST

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్​ను విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఆర్టికల్​ 32 ప్రకారం ఈ అంశంపై తాము విచారణ జరపలేమని జస్టిస్​ అశోక్​ భూషణ్ నేతృత్వంలోని​ ధర్మాసనం స్పష్టం చేసింది. చట్ట ప్రకారం స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు తగిన మార్గాలు ఉన్నాయని జస్టిస్ అశోక్ భూషణ్ వ్యాఖ్యానించారు. అనంతరం ఈ వ్యాజ్యాన్ని కొట్టివేశారు.

2021 అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేలా ప్రభుత్వం, ఎన్నికల సంఘం, ఇతర శాఖలను ఆదేశించాలని కోరుతూ..పునీత్ కౌర్ దండా అనే న్యాయవాది ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రతిపక్ష పార్టీల నేతలకు రక్షణ కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ తన వ్యాజ్యంలో కోరారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details