ప్రజలందరికీ ఉచిత డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, డీటీహెచ్ సేవలు కల్పించేలా కేంద్రం, సంబంధిత అధికారులను ఆదేశించాలనే పిటిషన్‌పై విచారణ చేపట్టబోమని తెలిపింది సుప్రీంకోర్టు. ఎలాంటి వ్యాజ్యాలు దాఖలు చేస్తున్నారని పిటిషనర్‌పై అసహనం వ్యక్తం చేసింది. అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యలతో తన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటానని చెప్పారు న్యాయవాది మనోహర్ ప్రతాప్.
ఫ్రీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్ పిటిషన్ తిరస్కరణ
లాక్డౌన్ సమయంలో ప్రజలకు ఉచిత డేటా, కాలింగ్, డీటీహెచ్ సదుపాయాలు కల్పించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎలాంటి వ్యాజ్యాలు దాఖలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది.
ఫ్రీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్ పిటిషన్ తిరస్కరణ
కరోనా కట్టడికి మే 3వరకు పొడిగించిన లాక్డౌన్ కారణంగా ప్రజలంతా మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, ఫ్రీ కాలింగ్, డీటీహెచ్ సదుపాయాలు కల్పిస్తే ఉపశమనం లభిస్తుందని పటిషన్లో పేర్కొన్నారు ప్రతాప్. వీడియో స్ట్రీమింగ్ వెబ్సైట్లు కూడా వినియోగదారులకు ఉచిత సేవలు కల్పించాలని విన్నవించారు. ఉచిత సౌకర్యాలుంటే ప్రజలంతా, తమ కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులతో మాట్లాడటం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందని, ఇష్టమైన ఛానళ్లను చూడవచ్చని అభిప్రాయపడ్డారు.