కరోనా నియంత్రణలో వివిధ రాష్ట్రాల తీరుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహమ్మారిపై పోరులో అన్ని రాష్ట్రాలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని వ్యాఖ్యానించింది. దిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్లో పరిస్థితి అదుపు తప్పుతోందని పేర్కొంది.
కరోనా బాధితులకు చికిత్స, కరోనా మృతదేహాల నిర్వహణపై సుమోటోగా జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం విచారించింది. కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలు, కేంద్రం నుంచి అవసరమైన సహాయం వివరాలతో నివేదిక సమర్పించాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. రెండు రోజుల్లో స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని స్పష్టం చేసింది.