రాజకీయాలను నేర రహితంగా తీర్చిదిద్దేందుకు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు నైతిక కొలమానంగా నిలుస్తుందని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. ఈ తీర్పును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు పేర్కొంది. ఎన్నికల రాజ్యాంగాన్ని మెరుగుపరిచేందుకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు ఎంతో దోహదపడుతాయని తెలిపింది.
ఎన్నికల్లో పోటీలో చేసే అభ్యర్థులు తమపై ఉన్న కేసులకు సంబంధించిన వివరాలను టీవీలు, పేపర్ల ద్వారా ప్రజలకు తెలపాలని ఈసీ 2018 అక్టోబరు 10న చేసిన మార్గదర్శకాలకు సుప్రీం తీర్పునకు అనుగుణంగా మార్పులు చేస్తామని అధికారులు చెప్పారు.
నేర చరిత్ర పొందుపరచాలని తీర్పు