తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్లాస్టిక్​ వినియోగంపై కేంద్రం, ఈసీలకు సుప్రీం నోటీసులు - SC notice to Centre, ECI on plea against use of plastic, especially banners, hoardings, during polls

కేంద్రం, భారత ఎన్నికల సంఘానికి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల్లో ప్లాస్టిక్​ వినియోగంపై  దాఖలైన పిటిషన్లపై స్పందించాలని ఆదేశించింది.

sc plastic
కేంద్రం, ఈసీఐకు సుప్రీం నోటీసులు

By

Published : Jan 9, 2020, 2:29 PM IST

Updated : Jan 9, 2020, 7:46 PM IST

ప్లాస్టిక్​ వినియోగంపై కేంద్రం, ఈసీలకు సుప్రీం నోటీసులు

ఎన్నికల్లో ప్లాస్టిక్​, బ్యానర్లు, హోర్డింగ్ల వినియోగంపై స్పందించాలని కేంద్రం, భారత ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారి చేసింది. ఈ అంశంపై గ్రీన్​ ట్రైబ్యునల్​ చేసిన సూచనలకు వ్యతిరేకంగా డబ్ల్యూ ఎడ్విన్​ విల్సన్​ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన సుప్రీం.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

జస్టిస్​ ఎల్​ నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం.... కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నాలుగు వారాల్లోగా ప్లాస్టిక్​ సంబంధిత వస్తువుల వినియోగంపై వివరణ ఇవ్వాలని వెల్లడించింది.

తొలుత నేషనల్​ గ్రీన్​ ట్రైబ్యునల్​...​ భారత ఎన్నికల సంఘంతో పాటు అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలలోని ఎన్నికల ఉన్నతాధికారులకు ప్లాస్టిక్​ వినియోగాన్ని తగ్గించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులు సమర్థవంతంగా​ లేవని సుప్రీంలో పిటిషన్​ వేశారు డబ్ల్యూ ఎడ్విన్​ విల్సన్​. ప్రచార సామగ్రికి వినియోగించే ప్లాస్టిక్​ పర్యావరణానికి హానికరమని వ్యాజ్యంలో పేర్కొన్నారు.

పిటిషన్​లో ఎన్నికల్లో ఉపయోగించే నిషేధిత పీవీసీ బ్యానర్లపై ఎన్జీటీ సరైన ఆదేశాలు ఇవ్వలేదని వ్యాజ్యంలో తెలిపారు.

ఇదీ చూడండి : సీఏఏ రాజ్యాంగబద్ధతపై ప్రకటన చేయలేం: సుప్రీం

Last Updated : Jan 9, 2020, 7:46 PM IST

ABOUT THE AUTHOR

...view details