ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్లాస్టిక్ బ్యానర్లు, హోర్డింగుల వాడకానికి వ్యతిరేకంగా దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. పర్యావరణం, అడవుల మంత్రిత్వ శాఖతో పాటు ఎన్నికల కమిషన్‌కు జస్టిస్ ఎల్.నాగేశ్వర రావు నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల్లో ప్లాస్టిక్ వాడకంపై నాలుగు వారాల్లోగా స్పందించాలని ఆదేశించింది.
ఎన్నికల్లో ప్లాస్టిక్ వాడకంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు - usage of plastic in elections pil in supreme court
ఎన్నికల ప్రచారంలో ప్లాస్టిక్ బ్యానర్లు, హోర్డింగుల వాడకాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. దీనిపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా స్పందన తెలియజేయాలని ఆదేశించింది.
ఈ వ్యాజ్యాన్ని డబ్ల్యూఎడ్విన్ విల్సన్ దాఖలు చేశారు. ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా జారీ అయిన సూచనలను పాటిస్తున్నారా లేదా అన్న విషయాన్ని పర్యవేక్షించాలని భారత ఎన్నికల సంఘం, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారులను కోరుతూ జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. అయితే పీవీసీ బ్యానర్లను ఎన్నికల్లో ఉపయోగించడంపై నిషేధం విధించాలన్న ప్రధాన సమస్యపై ఎన్‌జీటీ సమర్థంగా స్పందించలేదని పిటిషనర్ ఆరోపించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి హాని జరుగుతున్న విషయాన్ని గుర్తు చేశారు.