తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శివసేన పిటిషన్​పై అత్యవసర విచారణకు సుప్రీం నో - శివసేన పిటిషన్​పై అత్యవసర విచారణకు సుప్రీం నో

శివసేనకు సుప్రీంకోర్టులో భంగపాటు ఎదురైంది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు మూడు రోజుల గడువు ఇవ్వాలని చేసిన విజ్ఞప్తిని గవర్నర్ తిరస్కరించిన నేపథ్యంలో శివసేన న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే ఈ పిటిషన్​ను అత్యవసరంగా విచారించడానికి సుప్రీం నిరాకరించింది. బుధవారం రిట్​ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది.

శివసేన పిటిషన్​పై అత్యవసర విచారణకు సుప్రీం నో

By

Published : Nov 12, 2019, 8:37 PM IST

Updated : Nov 13, 2019, 12:01 AM IST

శివసేన పిటిషన్​పై అత్యవసర విచారణకు సుప్రీం నో

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు మరింత గడువు పొడిగించాలని చేసిన విజ్ఞప్తిని గవర్నర్ తిరస్కరించడాన్ని సవాల్​ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన శివసేనకు నిరాశ తప్పలేదు. శివసేన పిటిషన్​ను అత్యవసరంగా విచారించడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.

"బుధవారం 10.30 గంటలకు రిట్​ పిటిషన్​ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు శివసేనకు సూచించింది."
- సునీల్ ఫెర్నాండెజ్​, శివసేన న్యాయవ్యాది

రాష్ట్రపతి పాలనపైనా

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడాన్ని కూడా సవాల్​ చేయాలని శివసేన నిర్ణయించింది. ఈ పిటిషన్​ను ఎప్పుడు దాఖలు చేయాలో బుధవారం నిర్ణయిస్తామని సునీల్ తెలిపారు.

చివరికి ఇలా జరిగింది..

ప్రభుత్వ ఏర్పాటుకు మూడు రోజులు సమయం కావాలని శివసేన గవర్నర్​ భగత్ కోశ్యారీని అభ్యర్థించింది. అయితే అందుకు నిరాకరించిన గవర్నర్ సోమవారం రాత్రి ఎన్​సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. అనంతరం రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తూ రాష్ట్రపతికి లేఖ పంపించారు. ఫలితంగా మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తూ రామ్​నాథ్​ కోవింద్ నిర్ణయం తీసుకున్నారు. ఇది తక్షణమే అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:హెలికాప్టర్​ రేస్​లో టాటా, మహీంద్రా, అదానీ​... గెలుపు ఎవరిది?

Last Updated : Nov 13, 2019, 12:01 AM IST

ABOUT THE AUTHOR

...view details