లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలను స్వరాష్ట్రాలకు చేర్చడం, వారికి ఉపాధి కల్పన అంశాలపై తీర్పును ఈ నెల తొమ్మిదికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. వలస కార్మికులను వారి సొంత ప్రాంతాలకు తరలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 15 రోజుల సమయం ఇవ్వాలనుకుంటున్నట్లు అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
దేశంలో వలస కూలీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సుమోటోగా స్వీకరించిన సుప్రీం.. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఎంఆర్షా ధర్మాసనం విచారణ చేపట్టింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టిన ధర్మాసనం.. వారి వివరాల నమోదుకు రిజిస్ట్రేషన్, ఉపాధి కల్పనకు చర్యలు చేపట్టే విధంగా ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయనుంది.
4,200 శ్రామిక్ రైళ్ల ద్వారా..