తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అయోధ్య కేసు'లో వాదనలకు నేడే ఆఖరు..!

అయోధ్య రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాద కేసు విచారణ తుది దశకు చేరుకుంది. ఈ నెల 17తో విచారణ ముగియనుందని ఇటీవల సుప్రీంకోర్టు చెప్పింది. తాజాగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి.. వాదనలకు నేడే ఆఖరు రోజు అని సూచనప్రాయంగా తెలిపారు.

'అయోధ్య కేసు'లో వాదనలకు నేడే ఆఖరు..!

By

Published : Oct 16, 2019, 5:20 AM IST

Updated : Oct 16, 2019, 3:30 PM IST

'అయోధ్య కేసు'లో వాదనలకు నేడే ఆఖరు..!

రాజకీయంగా సున్నితమైన అయోధ్య కేసు విచారణ నేటితో ముగియనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం రోజు విచారణలో భాగంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి ఈ అంశంపై కాస్త స్పష్టతనిచ్చారు. నేటితో వాదనలు పూర్తవనున్నాయని వ్యాఖ్యానించారు.

'ఈ రోజు 39వ రోజు. రేపు 40 రోజు... ఈ కేసు విచారణకు ఈ రోజే ఆఖరు. నేడే వాదనలు ముగించాలని భావిస్తున్నాం.'

- మంగళవారం విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి

తొలుత విచారణ అక్టోబర్​ 18 కల్లా పూర్తి చేయాలని గడువుగా పెట్టుకుంది అత్యున్నత న్యాయస్థానం. ఇటీవల అక్టోబర్​ 17న వాదనలు ముగిస్తామని వెల్లడించింది. తాజాగా మరో రోజు ముందుగానే వాదనలు ముగించనున్నట్లు సూచనప్రాయంగా తెలిపింది. హిందూ, ముస్లిం వర్గాలు.. ఎదుటి పక్షాల వాదనలపై తమ తమ తుది అభిప్రాయాలను వెల్లడించేందుకు ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇచ్చే అవకాశముంది.

అయితే... అయోధ్య కేసు విచారణలో తుది తీర్పు నవంబర్​ 4-5 తేదీల్లో వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విచారణ ముగుస్తుండటం- ఏ సమయంలోనైనా అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో డిసెంబర్​ 10 వరకు అయోధ్యలో 144 సెక్షన్​ విధించారు.

మధ్యవర్తిత్వం విఫలమైన అనంతరం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి​ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. ఆగస్టు 6 నుంచి అయోధ్య కేసుపై రోజువారీ విచారణ చేపడుతోంది. వారం రోజుల దసరా సెలవుల విరామం తర్వాత... అక్టోబర్​ 14న ముస్లిం వర్గాల వాదనలు పూర్తయ్యాయి.

వివాదాస్పద భూమిపై కేసు...

అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్​ బోర్డ్​, నిర్మోహి అఖాడా, రామ్​ లల్లాకు సమానంగా పంచాలని 2010లో అలహాబాద్​ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుకు వ్యతిరేకంగా ఇప్పటివరకు సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి.

Last Updated : Oct 16, 2019, 3:30 PM IST

ABOUT THE AUTHOR

...view details