తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాహుల్​ ఎన్నికపై దాఖలైన పిటిషన్ కొట్టివేత - supreme court latest news

కేరళ వయనాడ్​ ఎంపీగా రాహుల్​గాంధీ ఎన్నికను సవాల్​ చేస్తూ దాఖలైన పిటిషన్​ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పిటిషన్​ వేసిన సరితా నాయర్​ పలుమార్లు విచారణలో పాల్గొనకపోవటం వల్ల ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. ఆమెకు లక్ష రూపాయల జరిమానా విధించింది.

SC junks plea against election of Rahul Gandhi from Wayanad seat
రాహుల్ గాంధీ పై దాఖలైన పిటిషన్​ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

By

Published : Nov 2, 2020, 2:55 PM IST

2019 సార్వత్రిక సమరంలో కేరళ వయనాడ్​ ఎంపీగా రాహుల్​గాంధీ ఎన్నికను సవాల్​ చేస్తూ సరితా నాయర్ దాఖలు చేసిన పిటిషన్​ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పిటిషనర్ తరపు న్యాయవాదులు పలుమార్లు విచారణలో పాల్గొనకపోవటంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. పిటిషనర్​కు రూ.లక్ష జరిమానా విధించింది.

కేరళ సోలార్​ స్కామ్​కు సంబంధించిన రెండు కేసుల్లో సరిత దోషిగా తేలారు. ఫలితంగా 2019 ఎన్నికల్లో వయనాడ్, ఎర్నాకుళం స్థానాలకు ఆమె వేసిన నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆమె కేరళ హైకోర్టును ఆశ్రయించగా... నిరాశే ఎదురైంది. తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లగా... ధర్మాసనం పిటిషన్​ను కొట్టివేసింది.

ABOUT THE AUTHOR

...view details