తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రిజర్వేషన్లపై రగడ- ఆందోళన అవసరం లేదని కేంద్రం భరోసా - పార్లమెంట్​

SC judgement that reservations
సుప్రీం ఇచ్చిన రిజర్వేషన్ల తీర్పుపై లోక్​సభ​లో రగడ

By

Published : Feb 10, 2020, 1:25 PM IST

Updated : Feb 29, 2020, 8:47 PM IST

14:50 February 10

రిజర్వేషన్ల కేసుతో మాకేం సంబంధం?

సుప్రీంకోర్టు 'రిజర్వేషన్ల తీర్పు'పై రగడ నేపథ్యంలో లోక్​సభలో ప్రకటన చేశారు సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి థావర్​ చంద్​ గెహ్లోత్​. పదోన్నతుల్లో రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు తీర్పు ఇచ్చిన కేసుతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. ఉత్తరాఖండ్​లో 2012లో కాంగ్రెస్​ అధికారంలో ఉన్న సమయంలోనే రిజర్వేషన్ల అంశం తెరపైకి వచ్చిందన్నారు. ఎస్సీ, ఎస్టీలు, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని తేల్చిచెప్పారు గహ్లోత్. ఈ విషయంపై ప్రభుత్వం ఉన్నతస్థాయిలో చర్చించి, తగిన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

కేంద్రం వివరణతో సంతృప్తి చెందని కాంగ్రెస్​ సభ్యులు... లోక్​సభ నుంచి వాకౌట్ చేశారు.

13:09 February 10

ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించటంపై లోక్​సభలో రగడ మొదలైంది. సర్వోన్నత న్యాయస్థానం తీర్పును పలువురు సభ్యులు వ్యతిరేకించారు. సుప్రీం తీర్పుతో లోక్​ జన శక్తి పార్టీ ఏకీభవించదని.. ఈ అంశంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు ఎల్​జేపీ అధ్యక్షుడు, ఎంపీ చిరాగ్​ పాసవాన్​.

ఎల్​జేపీ మాదిరిగానే అప్నా దల్​ సుప్రీం తీర్పును సమ్మతించదని పేర్కొన్నారు అనుప్రియా పటేల్​. ఇప్పటి వరకు ఇచ్చిన తీర్పులలో ఇదే అత్యంత దురదృష్టకరమైన తీర్పుగా పేర్కొన్నారు.

సుప్రీం రిజర్వేషన్ల అంశాల్ని పలువురు సభ్యులు సభలో లేవనెత్తిన క్రమంలో సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి మధ్యాహ్నం 2:15 గంటలకు వివరణ ఇస్తారని స్పష్టం చేశారు పార్లమెంట్​ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్​ జోషీ.

Last Updated : Feb 29, 2020, 8:47 PM IST

ABOUT THE AUTHOR

...view details