బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకొంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఒక్క పైసా కూడా చెల్లించలేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ ఎఫ్ నారిమన్ పేర్కొన్నారు. మాల్యాకు సంబంధించిన ఓ పిటిషన్ విచారణ నుంచి ఆయన తప్పుకొంటూ ఈ వ్యాఖ్యలు చేశారు.
మాల్యా పిటిషన్ విచారణ నుంచి తప్పుకున్న సుప్రీం జడ్జీ - విజయ్‌మాల్యా తాజా వార్తలు
విదేశాల్లో తలదాచుకుంటున్న ఆర్థిక నేరస్థుడు, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు సంబంధించిన ఓ పిటిషన్ విచారణ నుంచి సుప్రీం న్యాయమార్తి జస్టిస్ ఆర్ ఎఫ్ నారిమన్ తప్పుకున్నారు. తనను రూ.3,101 కోట్లు కట్టాలని కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ మాల్యా ఈ పిటిషన్ దాఖలు చేశారు.
కన్సార్షియం ఆఫ్ బ్యాంక్స్‌కు తనను రూ.3,101 కోట్లు చెల్లించాల్సిందిగా కర్టాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ మాల్యా ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను విచారించేందుకు జస్టిస్ నారిమన్ నిరాకరించారు. ఈ వ్యాజ్యాన్ని మరో సుప్రీం ధర్మాసనం విచారిస్తుందని తెలిపారు.
తనపై ఉన్న మనీలాండరింగ్ కేసు విచారణపై స్టే విధించాల్సిందిగా మాల్యా వేసిన పిటిషన్‌ను గత నెల బాంబే హైకోర్టు కొట్టివేసింది. దాదాపు రూ.9 వేల కోట్ల మేర రుణాలను మాల్యా ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయాడు. ఫలితంగా 2019 జనవరిలో ముంబయిలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టు మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించింది.
- ఇదీ చూడండి: బాంబు నిర్వీర్యం- అనుమానితుడి కోసం వేట షురూ