తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీఏఏ సంబంధిత పిటిషన్లపై ఈ నెల 22న సుప్రీం విచారణ - సీఏఏ సంబంధిత పిటిషన్లపై ఈనెల 22న సుప్రీం విచారణ

పౌర చట్టంపై హైకోర్టుల్లో పెండింగ్​లో ఉన్న పిటిషన్లను సుప్రీంకు బదిలీ చేయాలని కేంద్రం దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ చేపట్టింది సర్వోన్నత న్యాయస్థానం. కేంద్రం పిటిషన్​ సహా.. అన్ని వ్యాజ్యాలపై ఈనెల 22న విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.

SC
సీఏఏ సంబంధిత పిటిషన్లపై ఈనెల 22న సుప్రీం విచారణ

By

Published : Jan 11, 2020, 5:48 AM IST

పౌరసత్వ చట్ట సవరణపై వివిధ హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న అన్ని పిటిషన్లను సుప్రీం కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వం అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. హైకోర్టుల్లో వ్యాజ్యాలు వేసిన పిటిషన్‌దారులకు నోటీసులు జారీ చేసింది.

కేంద్రం బదిలీ పిటిషన్‌తో పాటు సీఏఏకు సంబంధించిన అన్ని పిటిషన్లపై ఈ నెల 22న విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది.

పౌరసత్వ చట్టాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులోనూ దాదాపు 60 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై గత నెల విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను జనవరి 22కు వాయిదా వేసింది. ఇప్పుడు కేంద్రం వేసిన తాజా బదిలీ పిటిషన్‌ను కూడా ఆ రోజే వింటామని ధర్మాసనం వెల్లడించింది.

ఇదీ చూడండి: నానాజాతి సమితికి వందేళ్లు.. భారత్​ సాధించిందేమిటి?

ABOUT THE AUTHOR

...view details