తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పరువు నష్టం కేసులో స్మృతికి సుప్రీం నోటీసులు

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వేసిన పరువునష్టం దావా కొట్టివేయాలని కాంగ్రెస్​ నేత సంజయ్​ నిరుపమ్ సుప్రీంలో పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంపై స్పందించాలని స్మృతికి నోటీసులు జారీచేసింది అత్యున్నత న్యాయస్థానం.

By

Published : Apr 22, 2019, 1:40 PM IST

Updated : Apr 22, 2019, 2:37 PM IST

స్మృతి ఇరానీకి సుప్రీం నోటీసులు

పరువు నష్టం కేసులో స్మృతికి సుప్రీం నోటీసులు

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్​ నేత సంజయ్​ నిరుపమ్​, స్మృతి ఇరానీలు పరస్పరం వేసుకున్న పరువునష్టం దావా కేసులపై స్పందించాలని స్మృతిని ఆదేశించింది.

ఓ కేసులో కాంగ్రెస్​ నేత నిరుపమ్​ దాఖలు చేసిన పరువునష్టం దావా​పై స్మృతి ఇరానీకి జారీ అయిన సమన్లను దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. అదే సమయంలో తన​పై జారీ అయిన సమన్లను కొట్టివేయాలన్న నిరుపమ్ పిటిషన్​ను తిరస్కరించింది హైకోర్టు. నిరుపమ్​పై దాఖలైన కేసు కొనసాగుతుందని గత ఏడాది డిసెంబర్​ 19న స్పష్టం చేసింది.

తాజాగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం నిరుపమ్ పిటిషన్​పై విచారణ చేపట్టింది. నిరుపమ్ రెండు పిటిషన్లు దాఖలు చేయగా.. సుప్రీం సోమవారం స్మృతికి స్పందించాలని నోటీసులు జారీ చేసింది.

Last Updated : Apr 22, 2019, 2:37 PM IST

ABOUT THE AUTHOR

...view details