తెలంగాణ

telangana

By

Published : May 10, 2019, 1:26 PM IST

ETV Bharat / bharat

ఎల్​జీ అధికారాల కేసులో సుప్రీం తాఖీదులు

పుదుచ్చేరి లెఫ్టినెంట్​ గవర్నర్​ అధికారాల కేసులో కాంగ్రెస్​ ఎమ్మెల్యే కె.లక్ష్మీనారాయణకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. మద్రాసు హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కిరణ్​ బేడీ దాఖలు చేసిన వ్యాజ్యంపై ఈమేరకు చర్యలు చేపట్టింది.

పుదుచ్చేరి కాంగ్రెస్​ ఎమ్మెల్యేకు సుప్రీం నోటీసులు

పుదుచ్చేరి లెఫ్టినెంట్​ గవర్నర్​ కిరణ్​ బేడీ, కాంగ్రెస్​ ప్రభుత్వం మధ్య వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. మద్రాసు హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కిరణ్​ బేడీ దాఖలు చేసిన పిటిషన్​పై స్పందించాలని కాంగ్రెస్​ ఎమ్మెల్యే కె. లక్ష్మీనారాయణకు నోటీసులు జారీ చేసింది సర్వోన్నత న్యాయస్థానం.

కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వ రోజువారీ పాలనా కార్యకలాపాల్లో లెఫ్టినెంట్​ గవర్నర్​ జోక్యం చేసుకోరాదన్న మద్రాసు హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు కిరణ్​ బేడీ.

ఈ పిటిషన్​పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.

సమస్య ఏమిటీ?

పుదుచ్చేరికి కిరణ్​ బేడీ లెఫ్టినెంట్​ గవర్నర్​గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అక్కడి ప్రభుత్వానికి, ఆమెకు మధ్య విభేదాలు తలెత్తాయి. ప్రభుత్వ రోజువారీ కార్యకలాపాల్లో ఎల్​జీ​ జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు కాంగ్రెస్​ నేతలు.

కిరణ్​ బేడీ తీరుపై కాంగ్రెస్​ ఎమ్మెల్యే కె. లక్ష్మీనారాయణ మద్రాస్​ హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. పుదుచ్చేరిలో లెఫ్టినెంట్​ గవర్నర్​ సమాంతర ప్రభుత్వం నడుపుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే పిటిషన్​పై ఏప్రిల్​ 30న విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ ఆర్​.మహదేవన్​ ప్రభుత్వ పాలనా కార్యకలాపాల్లో లెఫ్టినెంట్​ గవర్నర్​ జోక్యం చేసుకోరాదని తీర్పు వెలువరించారు.

ఇదీ చూడండి:'అయోధ్య'పై మధ్యవర్తిత్వం గడువు పెంపు

ABOUT THE AUTHOR

...view details