కొవిడ్ వ్యాక్సిన్ పేరుతో జరుపుతున్న పలురకాల మందుల అమ్మకాలపై విచారణ చేపట్టింది సుప్రీం కోర్టు. రెమిడెసివిర్, ఫావిపిరవిర్ వంటి ధ్రువీకరించని ట్రయల్ మందులకు సంబంధించిన 10 ఫార్మా కంపెనీలపై విచారణ చేపట్టాలని న్యాయవాది ఎం.ఎల్ శర్మ దాఖలు చేసిన పిటిషన్ను విచారించింది న్యాయస్థానం.
'వ్యాక్సిన్' పిటిషన్పై కేంద్రానికి సుప్రీం నోటీసులు - Covid vaccine
కరోనా వ్యాక్సిన్ పేరుతో పలురకాల మందుల అమ్మకాలపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు న్యాయవాది ఎం.ఎల్ శర్మ దాఖలు చేసిన పిటిషన్ను పరిశీలించిన సుప్రీం ధర్మాసనం.. కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

కొవిడ్ వ్యాక్సిన్ అమ్మకపు కంపెనీలపై విచారణ చేపట్టిన సుప్రీం
అత్యవసర పరిస్థితుల్లోనే ఈ మందులను కరోనా రోగులకు వాడాలన్ననిబంధనను గుర్తుచేస్తూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు శర్మ. ఈ విషయంపై స్పందించిన సుప్రీం ధర్మాసనం.. డబ్ల్యూహెచ్ఓ నివేదికను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
ఇదీ చదవండి-గుజరాత్ మాజీ సీఎం కేశుభాయ్ పటేల్ కన్నుమూత
TAGGED:
Remdesivir