తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాహుల్​ గాంధీకి కోర్టు ధిక్కరణ నోటీసులు - notice

రఫేల్​ తీర్పుపై వ్యాఖ్యల వ్యవహారంలో కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీకి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది సర్వోన్నత న్యాయస్థానం. మీనాక్షి లేఖి పిటిషన్​, రఫేల్​ తీర్పు పునఃసమీక్ష పిటిషన్లపై ఈనెల 30న విచారణ జరపనున్నట్లు తెలిపింది.

రాహుల్​ గాంధీకి కోర్టు ధిక్కరణ నోటీసులు

By

Published : Apr 23, 2019, 1:08 PM IST

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీకి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. రఫేల్​ తీర్పుపై తన వ్యాఖ్యలను తప్పుగా ఆపాదించారన్న రాహుల్​ వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

భాజపా ఎంపీ మీనాక్షి లేఖ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. 'చౌకీదార్​ చోర్​ హై' వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ రాహుల్​ దాఖలు చేసిన ప్రమాణపత్రాన్ని పరిశీలించింది. ధిక్కరణ పిటిషన్​ కొట్టివేయాలన్న రాహుల్​ అభ్యర్థనను తిరస్కరించింది. రాహుల్​కు కోర్టు ధిక్కరణ నోటీసు ఇవ్వడం సబబని తాము భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

కోర్టు ధిక్కరణ కేసును రఫేల్​ తీర్పు పునఃసమీక్ష వ్యాజ్యాలతో కలిపి ఈ నెల 30న విచారిస్తామని తెలిపింది సుప్రీంకోర్టు.

ఇదీ చూడండీ:భారత్​ భేరి: బిహార్​, కేరళలో ఈవీఎంల సమస్య

ABOUT THE AUTHOR

...view details