ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు సుప్రీంకోర్టు నిర్ధరించింది. ప్రశాంత్ భూషణ్‌పై కోర్టు ధిక్కరణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పువెల్లడించింది.
కోర్టు ధిక్కరణ కేసులో దోషిగా న్యాయవాది ప్రశాంత్
కోర్టు ధిక్కరణ కేసులో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌ను దోషిగా నిర్ధరించింది సుప్రీంకోర్టు. ఈ మేరకు తీర్పు వెల్లడించిన ధర్మాసనం.. శిక్ష విధింపుపై ఈ నెల 20న వాదనలు విననుంది.
కోర్టు దిక్కరణ కేసులో దోషిగా న్యాయవాది ప్రశాంత్ భూషణ్
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కోర్టులపై భూషణ్ చేసిన ట్వీట్లను సుమోటోగా తీసుకున్న అత్యున్నత ధర్మాసనం.. కోర్టు ధిక్కరణ కేసులో ఆయనను దోషిగా తేల్చింది.
భూషణ్‌కు శిక్ష విధించే విషయంపై జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 20న సుప్రీంకోర్టులో వాదనలు ఆలకించనుంది.