ప్రజాప్రతినిధుల కేసుల్లో సత్వర విచారణ చేపట్టాలన్న పిటిషన్ను సుప్రీం కోర్టు పరిశీలించింది. జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం వాజ్యాన్ని విచారించింది. రాష్ట్రాల హైకోర్టుల కార్యాచరణ ప్రణాళికను కోర్టుకు సమర్పించారు అమికస్ క్యూరీ.
'ప్రజాప్రతినిధుల' కేసులపై సుప్రీం విచారణ వాయిదా
ప్రజాప్రతినిధులపై పెండింగ్లో ఉన్న కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేయాలన్న పిటిషన్పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది సుప్రీం కోర్టు. ఇందుకోసం కొన్ని రాష్ట్రాల హైకోర్టులు ఇచ్చిన నివేదికలో వివరాలు సమగ్రంగా లేవని సుప్రీం వ్యాఖ్యానించింది.
'ప్రజాప్రతినిధుల' కేసులపై సుప్రీం విచారణ వాయిదా
అయితే కొన్ని రాష్ట్రాల హైకోర్టులు ఇచ్చిన నివేదికలో వివరాలు సమగ్రంగా లేవని వ్యాఖ్యానించింది అత్యున్నత న్యాయస్థానం. గత విచారణలో కోరిన వివరాలు ఇచ్చేందుకు కేంద్రానికి మరికొంత గడువు ఇచ్చింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది సర్వోన్నత న్యాయస్థానం.
- ఇదీ చూడండి: ప్రజాప్రతినిధుల కేసులపై సుప్రీం కీలక ఆదేశాలు