కరోనాపై పోరులో భాగంగా దేశం లాక్డౌన్లోకి వెళ్లిపోయినప్పటి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే కేసుల విచారణ చేపడుతోంది సుప్రీం కోర్టు. లాక్డౌన్ నెల రోజుల వ్యవధిలో 593 కేసులను విచారించిన సుప్రీం 215 తీర్పులుచ్చింది.
తొలి దశ లాక్డౌన్కు రెండు రోజుల(మార్చి 23) ముందే కోర్టులోకి పిటిషనర్లు, న్యాయవాదులకు అనుమతిని నిరాకరించింది అత్యున్నత న్యాయస్థానం. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యవసర కేసులను మాత్రమే విచారించనున్నట్టు స్పష్టం చేసింది.