తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సైన్యంలో మహిళా కమిషన్ ఏర్పాటుకు మరో నెల గడువు

సైన్యంలోని మహిళా అధికారుల అంశమై కీలక తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. ఫిబ్రవరి నాటి తమ తీర్పునకు అనుగుణంగా ఆర్మీలో మహిళా కమిషన్ ఏర్పాటు చేసేందుకు మరో నెలపాటు గడువు పొడిగించింది.

supreme court
సైన్యంలో మహిళా కమిషన్ ఏర్పాటుకు మరో నెల గడువు

By

Published : Jul 7, 2020, 12:55 PM IST

సైన్యంలోని మహిళా అధికారుల కోసం ప్రత్యేక కమిషన్​ను ఏర్పాటు చేసేందుకు రక్షణ శాఖకు మరో నెలపాటు గడువు పొడిగించింది సుప్రీంకోర్టు. ఫిబ్రవరిలో ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా ఈ నిర్ణయాన్ని వెలువరించింది. కేసు విచారణ చేపట్టిన జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఫిబ్రవరి నాటి తీర్పునకు కేంద్రం కట్టుబడి ఉండాలని చెప్పింది.

రక్షణశాఖ నివేదన..

కమిషన్ ఏర్పాటు ప్రక్రియ తుది దశలో ఉందని సుప్రీంకు నివేదించింది రక్షణశాఖ. అధికారిక ఆదేశాలు మాత్రమే పెండింగ్​లో ఉన్నట్లు సుప్రీం ఎదుట వెల్లడించింది.

కేసు నేపథ్యమిదీ..

సైన్యంలోని మహిళా అధికారుల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటుకు ఆదేశించాలని దాఖలైన ఓ పిటిషన్​పై విచారించింది సుప్రీం. మహిళా అధికారులకు దేహ దారుఢ్య విషయమై ఉన్న పరిమితుల ఆధారంగా వారిపై వివక్ష చూపకూడదని ఫిబ్రవరి నాటి తీర్పులో కేంద్రానికి సూచించింది సుప్రీం. సైన్యంలో మహిళా అధికారులకు ప్రత్యేక కమిషన్, కమాండ్ పోస్టింగ్​లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మూడు నెలల లోపు తమ ఆదేశాలను అమలు చేయాలని చెప్పింది. సుప్రీం విధించిన గడువు తీరిన నేపథ్యంలో కేంద్రం వినతిపై మరో నెల సమయం ఇచ్చింది.

ఇదీ చూడండి:సరిహద్దులో భద్రత కట్టుదిట్టం.. రాత్రి వేళ హెలికాప్టర్ల గస్తీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details