మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. నేరస్థులను రక్షించేందుకు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని దిల్లీ వాసులైన విక్రమ్ గహ్లోత్, రిషభ్ జైన్, గౌతమ్ శర్మ దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు తిరస్కరించింది ధర్మాసనం. రాష్ట్రపతిని సంప్రదించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది.
"దేశ పౌరులుగా రాష్ట్రపతిని సంప్రదించేందుకు మీకు స్వేచ్ఛ ఉంది. ఇక్కడ(సుప్రీంకోర్టు)కు రాకండి. బాలీవుడ్ నటుడు మరణించారని చెప్పి.. రాష్ట్రంలో రాజ్యాంగం కొనసాగడం లేదని మీరంటున్నారు. మీరు మాట్లాడుతున్న ప్రతీ సంఘటన ముంబయికి సంబంధించినదే. మహారాష్ట్ర ఎంత పెద్దదో మీకు అవగాహన ఉందా? ఇలాంటివి మేం అంగీకరించం."