అయోధ్యలో మసీదును నిర్మించేందుకు ఏర్పాటైన ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్టులో ప్రభుత్వం నామినేట్ చేసిన ప్రతినిధులకు చోటు కల్పించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సున్నీ వక్ఫు బోర్డుకు ఈ విషయంలో పూర్తి స్వేచ్ఛ ఉందని పేర్కొంది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు న్యాయవాదులు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని శుక్రవారం విచారించిన అనంతరం.. జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.
'అయోధ్యలో మసీదు నిర్మాణ ట్రస్టులో వారు అవసరం లేదు' - Ayodhya mosque construction
అయోధ్యలో మసీదును నిర్మించే ట్రస్టులో ప్రభుత్వ ప్రతినిధులకు చోటు కల్పించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మసీదు నిర్మాణ విషయంలో సున్నీ వక్ఫ్ బోర్డుకు పూర్తి స్వేఛ్చ ఉందని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది.
అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శ్రీరామ జన్మభూవి తీర్థక్షేత్ర ట్రస్టులో ప్రభుత్వం నామినేట్ చేసిన ప్రతినిధులకు చోటు కల్పించినట్లే.. మసీదును నిర్మించే ట్రస్టులో కూడా యూపీ, కేంద్ర ప్రభుత్వాలు నామినేట్ చేసే ప్రతినిధులకు అవకాశం ఇవ్వాలని యూపీకి చెందిన న్యాయవాదులు శిశిర్ చతుర్వేది, కమలేశ్ కుమార్ శుక్లా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్టుకు దేశ విదేశాల నుంచి నిధులు వస్తాయని.. వీటి నిర్వహణ, పారదర్శకత కోసం ఈ మేరకు ఆదేశాలివ్వాలని కోరారు. పిటిషన్‌ను పరిశీలించిన అత్యున్నత ధర్మాసనం ఆ అవసరం లేదని స్పష్టం చేసింది.