తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నిర్భయ దోషికి చుక్కెదురు- క్యురేటివ్​ పిటిషన్​ కొట్టివేత

nirbhaya case
సుప్రీంలో నిర్భయ దోషికి చుక్కెదురు

By

Published : Jan 30, 2020, 1:54 PM IST

Updated : Feb 28, 2020, 12:48 PM IST

13:52 January 30

సుప్రీంలో నిర్భయ దోషికి చుక్కెదురు.. క్యురేటివ్​ పిటిషన్​ కొట్టివేత

దేశ రాజధానిలో సంచలనం సృష్టించిన నిర్భయపై అత్యాచారం, హత్య కేసులో మూడో దోషి అక్షయ్‌ ఠాకూర్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. అక్షయ్​ దాఖలు చేసిన క్యురేటివ్​ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.

అక్షయ్​ పిటిషన్​పై విచారణ చేపట్టిన జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. ఉరి అమలుపై స్టే విధించాలన్న వ్యాజ్యాన్నీ కొట్టివేసింది.

ఏర్పాట్లు ముమ్మరం..

2012లో జరిగిన ఈ దారుణ ఘటనలో దోషులుగా తేలిన నలుగురినీ ఫిబ్రవరి 1న ఉరితీసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈలోపు ఉరిశిక్ష అమలును వాయిదా వేయించేలా దోషులు తమకు ఉన్న చిట్టచివరి న్యాయపరమైన అవకాశాలను వెతుక్కుంటూ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
తనకు విధించిన ఉరిశిక్షను సవాల్‌ చేస్తూ అక్షయ్‌ ఠాకూర్‌ గత నెలలో రివ్యూ పిటిషన్‌ వేయగా సుప్రీం ఆ వ్యాజ్యాన్ని కొట్టివేసింది. తాజాగా న్యాయపరంగా చివరి అవకాశమైన క్యురేటివ్‌ పిటిషన్‌ను కొట్టివేసింది.

మరింత ఆలస్యం అవుతుందా?

ఈ కేసులో మరో దోషి వినయ్​ కుమార్​ శర్మ కూడా క్షమాభిక్ష పిటిషన్​ వినియోగించుకున్నాడు. దీనిపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నిబంధనల ప్రకారం, ఒకే నేరానికి పాల్పడిన దోషులకు ఒకేసారి మరణశిక్ష అమలు చేయాలి. వీరిలో ప్రతి ఒక్కరూ తమకున్న చట్టపరమైన అన్ని అవకాశాలు ఉపయోగించుకున్న తరువాతనే, శిక్ష అమలు చేయాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం, సాధారణంగా రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషిన్​ను తిరస్కరించిన 14 రోజుల వరకు దోషులను ఉరితీయలేరు. కనుక నిర్భయ దోషుల 'ఉరి'శిక్ష అమలు ఆలస్యమయ్యే అవకాశముందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Last Updated : Feb 28, 2020, 12:48 PM IST

ABOUT THE AUTHOR

...view details