కరోనా కారణంగా దేశవ్యాప్తంగా జీవనోపాధి కోల్పోయిన సెక్స్వర్కర్లకు ఎలాంటి గుర్తింపు కార్డులు అడగకుండా రేషన్ పంపిణీ చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశించింది సుప్రీం కోర్టు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ లేదా జిల్లా న్యాయాధికారుల చేత గుర్తింపు పొందిన సెక్స్వర్కర్లకు రేషన్ అందించాలని సూచించింది.
'సెక్స్ వర్కర్ల కోసం ఏ విధమైన చర్యలు తీసుకున్నారు. ఎంతమందికి ఉచిత రేషన్ అందజేశారు' అనే విషయాలపై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశించింది సుప్రీంకోర్టు. ట్రాన్స్జెండర్లకు ఇచ్చిన విధంగానే సెక్స్ వర్కర్లకు కూడా ఆర్థిక సాయాన్ని అందజేయాలని కేంద్రానికి సూచించింది.