తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేంద్రానికి ఊరట... రఫేల్ కేసు వాయిదా - supreme

రఫేల్​ తీర్పును సమీక్షించాలని దాఖలైన వ్యాజ్యాలపై విచారణను సోమవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. అదనపు ప్రమాణపత్రం దాఖలుకు మరింత సమయం కావాలన్న కేంద్రం అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. మే 4లోపు ప్రమాణ పత్రం సమర్పించాలని ఆదేశించింది.

రఫేల్​

By

Published : Apr 30, 2019, 3:54 PM IST

Updated : Apr 30, 2019, 7:00 PM IST

రఫేల్​పై పునఃసమీక్ష

రఫేల్​ కేసు తీర్పును సమీక్షించాలన్న వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు విచారణ సోమవారానికి వాయిదా పడింది. అదనపు ప్రమాణపత్రం సమర్పించేందుకు అత్యున్నత న్యాయస్థానాన్ని 4 వారాల సమయం కోరింది కేంద్రం. అందుకు అంగీకరించని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం... మే 4లోగా ప్రమాణ పత్రం దాఖలు చేయాలని ఆదేశించింది.

తదుపరి విచారణ మే 6న జరుగుతుందని స్పష్టం చేసింది.

ఫ్రాన్స్​ నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు​ ఒప్పందంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని సుప్రీంకోర్టు గతేడాది డిసెంబర్​ 14న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ కేంద్ర మాజీ మంత్రులు అరుణ్​ శౌరి, యశ్వంత్​ సిన్హా, న్యాయవాది ప్రశాంత్​ భూషణ్​ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆప్​ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్​ సింగ్​ కూడా వేరుగా పిటిషన్​ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై నేడు విచారణ జరగాల్సి ఉంది.

సమాచారం లేకనే..

రివ్యూ పిటిషన్లపై తమకు అధికారికంగా సమాచారం అందలేదని కేంద్రం తరఫున అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్​ కోర్టుకు నివేదించారు.

సమీక్ష పిటిషన్లపై కేంద్రానికి సుప్రీంకోర్టు వెంటనే నోటీసులు జారీచేసింది. వీటికి సమాధానం ఇచ్చేందుకు 4 వారాల గడువు ఇవ్వాలని వేణుగోపాల్​ కోరారు. ఈ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

ఇదీ చూడండి: నాలుగో విడతకే నలుమూలలా ఓడారు: మోదీ

Last Updated : Apr 30, 2019, 7:00 PM IST

ABOUT THE AUTHOR

...view details