అసోం జాతీయ పౌర రిజిస్టర్(ఎన్ఆర్సీ) రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన కో-ఆర్డినేటర్ ప్రతీక్ హజేలాను బదిలీ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది సుప్రీంకోర్టు. ఎన్ఆర్సీ జాబితా విడుదల తరువాత ఆయనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
హజేలాను డిప్యూటేషన్‌పై మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం.