తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఉన్నావ్' కేసుల విచారణకు తీస్​ హజారీ జిల్లా జడ్జి - సీబీఐకి కేసు బదిలీ

ఉన్నావ్​ అత్యాచార ఘటన కేసుల విచారణకు దిల్లీలోని తీస్​ హజారీ జిల్లా న్యాయమూర్తి ధర్మేశ్​ శర్మను నియమించింది సుప్రీంకోర్టు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులను లఖ్​నవూ​ నుంచి దిల్లీ సీబీఐకి బదిలీ చేస్తూ గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది సర్వోన్నత న్యాయస్థానం.

'ఉన్నావ్' కేసుల విచారణకు తీస్​ హజారీ జిల్లా జడ్జి

By

Published : Aug 2, 2019, 5:40 AM IST

Updated : Aug 2, 2019, 7:47 AM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్​ అత్యాచార కేసుల విచారణకు పశ్చిమ దిల్లీలోని తీస్​ హజారీ జిల్లా న్యాయమూర్తి ధర్మేశ్​ శర్మ​ను ఎంపిక చేసింది సుప్రీంకోర్టు.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం ఉన్నావ్​ అత్యాచార ఘటనకు సంబంధించిన ఐదు కేసులను ఉత్తరప్రదేశ్‌ నుంచి దిల్లీ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ గురువారం కీలక తీర్పును వెలురించింది. తాత్కాలిక సాయం కింద బాధితురాలికి 25లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాధితురాలి కారు ప్రమాద ఘటనపై 7 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది.

లేఖ ఆలస్యంపై దర్యాప్తు

ఎమ్మెల్యే కుల్‌దీప్‌సింగ్‌ సెన్​గర్​ నుంచి ప్రాణహాని ఉందని పేర్కొంటూ ఈ నెల 12న సీజేఐకు లేఖ రాసింది ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి కుటుంబం. ఈ లేఖ తన వద్దకు ఆలస్యంగా రావడానికి గల కారణలపై సిట్టింగ్​ జడ్జి పర్వవేక్షణలో విచారణ జరపాలని సెక్రెటరీ జనరల్​ను ఆదేశించారు సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయి.

సీఎం రాజీనామాకు ఎస్పీ డిమాండ్​

ఉన్నావ్ అత్యాచార బాధితురాలికి న్యాయం జరగాలంటే ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్​, నిందితుడు కుల్​దీప్ సింగ్​, డిజీపీ ఓపీ సంగ్​లను పదవుల నుంచి తప్పించాలని ట్వీట్​ చేసింది సమాజ్​వాద్​ పార్టీ.

రోడ్డు ప్రమాద ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఎస్పీ నేత రామ్​ గోవింద్​ చౌదరి.

ఇదీ చూడండి: 'ఉన్నావ్​' నిందితుడిపై బహిష్కరణ వేటు

Last Updated : Aug 2, 2019, 7:47 AM IST

ABOUT THE AUTHOR

...view details