తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహాత్మునికి భారతరత్న కోరిన పిటిషన్​ తిరస్కరణ

మహాత్మాగాంధీకి భారతరత్న ప్రకటించాలని దాఖలైన పిటిషన్​ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మహాత్ముని స్థాయి పురస్కారాల కన్నా ఎక్కువ అని వ్యాఖ్యానించింది.

sc-declines-pil-seeking-bharat-ratna-for-mahatma-gandhi
మహాత్మునికి భారతరత్న కోరిన పిటిషన్​ తిరస్కరణ

By

Published : Jan 17, 2020, 3:28 PM IST

Updated : Jan 18, 2020, 12:01 AM IST

జాతిపిత మహాత్మగాంధీకి దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. మహాత్ముడు జాతి పిత అని.. ఆయనను ప్రజలు మహోన్నత గౌరవంతో చూస్తారని తెలిపింది. అలాంటి వ్యక్తి స్థాయి ఏ గుర్తింపునకైనా ఎక్కువే అని వ్యాఖ్యానించింది ఎస్​.ఏ.బోబ్డే నేతృత్వంలోని అత్యున్నత ధర్మాసనం.

అయితే ప్రజల అభిమానాన్ని తాము గౌరవిస్తామన్న సుప్రీం.. ఈ వినతిని కేంద్ర ప్రభుత్వానికి అందజేయాలని పిటిషనర్‌ అనిల్‌ దత్తా శర్మకు సూచించింది.

ఇదీ చూడండి: కేరళ బాటలో పంజాబ్... సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం

Last Updated : Jan 18, 2020, 12:01 AM IST

ABOUT THE AUTHOR

...view details