దేశంలో మొహర్రం సందర్భంగా నిర్వహించే ఊరేగింపునకు అనుమతిని నిరాకరించింది సుప్రీంకోర్టు. ఈ మేరకు లఖ్‌నవూకు చెందిన సయాద్ కాల్బే జావేద్ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన... ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.
పరిమిత సంఖ్యలో ప్రార్థనలు నిర్వహించుకోవడానికి అనుమతి కోసం అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది ధర్మాసనం. ఈ అంశమై దేశం మొత్తానికి సాధారణ ఉత్తర్వులను ఎలా జారీ చేయగలమని ప్రశ్నించింది ఉన్నత న్యాయస్థానం.