తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మద్యం హోం డెలివరీపై సుప్రీం కీలక సూచనలు - Home delivery of liquor latest news

లాక్​డౌన్​ సమయంలో మద్యాన్ని ప్రత్యక్షంగా కాకుండా.. పరోక్షంగా విక్రయించే మార్గాలపై దృష్టిపెట్టాలని రాష్ట్రాలకు సూచించింది సుప్రీంకోర్టు. ఆన్​లైన్​లో మద్యం అమ్మకాలు, హోం డెలివరీకి సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని నిర్దేశించింది. ప్రస్తుత అమ్మకాలపై స్టే ఇచ్చేందుకు మాత్రం నిరాకరించింది.

SC asks states to consider online sales, home delivery of liquor
ఆన్​లైన్​ మద్యం విక్రయాలపై పరిశీలించండి : సుప్రీంకోర్టు

By

Published : May 8, 2020, 4:11 PM IST

40 రోజుల లాక్​డౌన్​.. బార్లు, పబ్బులు, వైన్​ షాపులు అన్నీ బంద్​.. ప్రభుత్వ ఖజానాకు భారీ చిల్లు.. కరోనా వైరస్​ వ్యాప్తిని నివారించేందుకు దేశవ్యాపంగా విధించిన లాక్​డౌన్​ పరిణామం ఇది. ఈ నేపథ్యంలో ఆర్థిక కష్టాల నుంచి కొంత మేర ఉపశమనం పొందేందుకు వైన్​ షాపులు తెరిచేందుకు అనుమతిచ్చింది కేంద్రం. ఇంకేముంది.. ఎన్నో రోజులుగా నిషాకు దూరమైన వారు.. ఆడ, మగ అనే తేడా లేకుండా మద్యం దుకాణాల ముందు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. భౌతిక దూరాన్ని లెక్కచేయకుండా.. మద్యం బాటిళ్ల కోసం ఒకరిమీదొకరు పడ్డారు.

పరిస్థితి ఇలాగే కొనసాగితే వైరస్ వ్యాప్తి మరింత ఉద్ధృతమయ్యే అవకాశముందని.. లాక్​డౌన్​లో మద్యాన్ని ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా విక్రయించే మార్గాలపై దృష్టిపెట్టాలని రాష్ట్రాలకు సూచించింది సుప్రీంకోర్టు. ఆన్​లైన్​లో మద్యం అమ్మడం సహా హోం డెలవరీ చేసే అంశాన్ని పరిశీలించాలని నిర్దేశించింది. ప్రస్తుత అమ్మకాలపై స్టే ఇచ్చేందుకు మాత్రం నిరాకరించింది.

మద్యం అమ్మకాలపై ప్రభుత్వ అనుమతికి వ్యతిరేకంగా గురుస్వామి నటరాజ్​ అనే వ్యక్తి సుప్రీంలో పిటిషన్​ దాఖలు చేశారు. దేశవ్యాప్తంగా 70వేలకు పైగా మద్యం దుకాణాలున్నాయని కోర్టుకు విన్నవించారు. షాపు యజమానులు భౌతికదూరం నిబంధనలు పాటించడం లేదని తద్వారా వైరస్​ కేసులు పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. నటరాజ్​ వ్యాజంపై విచారణ జస్టిస్​ అశోక్​ భూషణ్​ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది.

పంజాబ్​, బంగాల్​లో ఇప్పటికే హోం డెలివరీ, ఆన్​లైన్​ మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి.

మే 1న లాక్​డౌన్​ నిబంధనలను సడలించింది కేంద్ర హోంశాఖ. మద్యం, పాన్​, గుట్కా అమ్మకాలకు అనుమతిచ్చింది. అయితే ఒక్కో షాపు వద్ద గరిష్ఠంగా ఐదుగురు మాత్రమే ఉండాలని, 6 అడుగుల భౌతిక దూరం పాటించేలా చూడాలని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి : కరోనా సోకిన మూడో రోజుకే వాసన చూసే శక్తి మాయం!

ABOUT THE AUTHOR

...view details