తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మేఘాలయ సర్కారుకు రూ.100 కోట్ల జరిమానా - మేఘాలయ

బొగ్గు అక్రమ తవ్వకాలపై మేఘాలయ సర్కారుకు రూ. 100 కోట్ల జరిమానా విధించింది సుప్రీంకోర్టు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వద్ద డిపాజిట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జాతీయ హరిత ట్రిబ్యునల్​ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.

మేఘాలయ రాష్ట్రానికి సుప్రీం రూ.100 కోట్ల జరిమానా

By

Published : Jul 3, 2019, 5:03 PM IST

బొగ్గు అక్రమ తవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ విధించిన రూ. 100 కోట్ల జరిమానాను చెల్లించాలని సుప్రీం కోర్టు మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వద్ద జరిమానాను డిపాజిట్ చేయాలని సూచించింది.

అక్రమంగా తవ్వకాలు జరిపిన బొగ్గును కోల్​ ఇండియా లిమిటెడ్​కు స్వాధీనం చేయాలని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ కే ఎం జోసెఫ్​లతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. అక్రమ బొగ్గును వేలం వేసి వచ్చిన సొమ్మును రాష్ట్ర ప్రభుత్వానికి అందించాల్సిందిగా కోల్​ఇండియాకు సూచించింది.

ప్రజలు తమ సొంత భూముల్లోని బొగ్గు తవ్వకాలు జరిపేందుకు సుప్రీం అనుమతించింది. దీనికి సంబంధిత అధికారుల నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొంది.

విచారణ సందర్భంగా ఈశాన్య రాష్ట్రాల్లో బొగ్గు అక్రమ తవ్వకాలను మేఘాలయ ప్రభుత్వం అంగీకరించింది.

గతేడాది డిసెంబర్ 13న తూర్పు జైన్​టియా జిల్లా క్సాన్​లో అక్రమ బొగ్గు మైనింగ్ క్షేత్రంలో 15మంది మైనర్లు చిక్కుకుపోయి అసువులు బాసారు. అటవీ ప్రాంతంలో ఉన్న 3.7 కిలోమీటర్ల లోతైన ఈ అక్రమ మైనింగ్ క్షేత్రంలోకి నీరు చేరడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటి వరకు కేవలం ఇద్దరి మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి.

ఇదీ చూడండి: కర్ణాటకలో ఘోర ప్రమాదం- 12 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details