తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సమాచార కమిషనర్ల నియామకాలపై నివేదిక ఇవ్వండి' - సమాచార కమిషన్ల నియామకాలపై నివేదిక ఇవ్వండి

కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషన్లలోని ఖాళీలను భర్తీ చేయడం లేదంటూ దాఖలైన పిటిషన్​ను సుప్రీం ధర్మాసనం విచారించింది. వెంటనే కమిషన్​ నియామకాల స్థితిపై నివేదిక(స్టేటస్ రిపోర్టు) అందజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

సమాచార కమిషన్ల నియామకాలపై నివేదిక ఇవ్వండి: సుప్రీంకోర్టు

By

Published : Nov 6, 2019, 1:02 PM IST

Updated : Nov 6, 2019, 1:12 PM IST

కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషన్లలోని ఖాళీలను భర్తీ చేయడంపై (స్థితి నివేదిక) స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని, 9 రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. సమాచార కమిషన్లలో ఖాళీలు భర్తీ చేయాలని ఇంతకు ముందు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వాలు అమలు చేయలేదంటూ ఆర్టీఐ కార్యకర్తలు అంజలీ భరద్వాజ్​ తదితరులు వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్​ను విచారించిన జస్టిస్ ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. తాజా ఆదేశాలు జారీచేసింది.

ఆర్టీఐ కార్యకర్తల తరపున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. సుప్రీం ఆదేశాలను కాదని, సమాచార కమిషన్​లోని ఖాళీలను భర్తీచేయడానికి ఎంపిక చేసిన అభ్యర్థుల పేర్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వెబ్​సైట్​లో ఉంచలేదని అన్నారు.

ఇదీ చూడండి: హెచ్​1బీ వీసాల తిరస్కరణలో భారత కంపెనీలే ఎక్కువ

Last Updated : Nov 6, 2019, 1:12 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details