హరియాణా, పంజాబ్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం జరగకుండా నివారణ చర్యలు తీసుకునేందుకు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మదన్ బీ లోకూర్తో కూడిన ఏకసభ్య కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి కావాల్సిన సహకారం అందించాలని మూడు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు, పర్యావరణ కాలుష్య నియంత్రణ అథారిటీకి ఆదేశాలు జారీ చేసింది.
వ్యర్థాల దహనాలు గుర్తించేందుకు ఎన్‌సీసీ, ఎన్‌ఎస్ఎస్, భారత్ స్కౌట్స్ బృందాల వినియోగం సరైనదేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కమిటీ ఏర్పాటుపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. 15 రోజులకోసారి లేదా అవసరమైనప్పుడు కమిటీ నివేదిక అందించాలని సుప్రీంకోర్టు సూచించింది.