2019 జాతీయ దర్యాప్తు సంస్థ చట్టంలో చేసిన సవరణలను సవాలు చేస్తూ సుప్రీంలో దాఖలైన పిటిషన్ను విచారించేందుకు ధర్మాసనం అంగీకారం తెలిపింది. జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ ఎస్ రవింద్ర భట్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది.
పిటిషన్ దాఖలు చేసిన 'సాలిడారిటీ యూత్ మూమెంట్' సంస్థ.. జాతీయ భద్రతకు సంబంధించిన నేరాలపై విచారణ జరిపేందుకు రూపొందించిన ఈ చట్టానికి కొత్తగా సవరణ చేయడం వల్ల బలహీనమైందని పేర్కొంది .
జాతీయ భద్రత, దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, విదేశాలతో సత్సంబంధాలు, అంతర్జాతీయ ఒప్పందాలు తదితర వాటికి సంబంధించిన కేసులన్నింటినీ దర్యాప్తు చేసేందుకు ఎన్ఐఏను రూపొందించినట్లు పిటిషన్లో వివరించారు. కాగా.. వ్యభిచారం కోసం మైనర్లను అక్రమ రవాణా చేయడం, వెట్టిచాకిరి, నకిలీ నోట్ల పంపిణీ వంటి ఉగ్రవాదానికి సంబంధం లేని నేరాలను చట్ట సవరణలో పొందుపరిచారు. తద్వారా రాష్ట్ర దర్యాప్తు సంస్థలకు చెందిన అధికారాలను కేంద్రం గుప్పెట్లోకి తీసుకుందని పిటిషన్లో పేర్కొన్నారు.
చట్టాన్ని సవాలు చేసిన తొలి రాష్ట్రం