తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనాపై ప్రజలకు మోదీ సందేశం ఇదే.. - narendra modi latest news

దేశంలో కరోనా వైరస్​ పరిస్థితిపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని, జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సాధ్యమైనంత వరకు గుంపులుగా ఉండకూడదని ట్వీట్​ చేశారు.

modi latest news
భయం వద్దు జాగ్రత్తలు పాటించండి: కరోనాపై మోదీ సందేశం

By

Published : Mar 12, 2020, 6:04 PM IST

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం పటిష్ట చర్యలు చేపట్టినట్లు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. పరిస్థితిపై కేంద్రం అప్రమత్తంగా ఉందని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. ఎలాంటి ఆందోళకు గురికావద్దని.. తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించారు.

మోదీ ట్వీట్​

"ఎలాంటి భయం వద్దు. జాగ్రత్తలు పాటించండి. కొద్ది రోజుల పాటు కేంద్ర మంత్రులు ఎవరూ విదేశీ పర్యటనలకు వెళ్లరు. మీరు కూడా అవసరమైతే తప్ప ప్రయాణం చేయకండి. గుమిగూడకుండా ఉంటే కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చు "

-ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్.

భారత్​లో కరోనా కేసుల సంఖ్య 73కు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​ తెలిపారు.

ఇదీ చూడండి: కమల్​నాథ్​ సర్కార్​ భవితవ్యం తేలేది ఆరోజే...

ABOUT THE AUTHOR

...view details