తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సావర్కర్ విలువలే దేశ నిర్మాణానికి పునాదులు'

హిందుత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్​ విలువలే దేశ నిర్మాణానికి మూల స్తంభాలన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మహారాష్ట్ర అకోలాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్​-ఎన్సీపీలది అవినీతి కూటమని ధ్వజమెత్తారు మోదీ.

By

Published : Oct 16, 2019, 3:07 PM IST

Updated : Oct 16, 2019, 3:27 PM IST

'సావర్కర్ విలువలే దేశ నిర్మాణానికి పునాదులు'

కాంగ్రెస్-ఎన్సీపీ అవినీతి కూటమని తీవ్ర ఆరోపణలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు నేతలు ఆర్టికల్​ 370తో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధమేంటని ప్రశ్నిస్తున్నారని, వారికి ఎంత ధైర్యమని మండిపడ్డారు.

మహారాష్ట్ర అకోలాలో ఎన్నికల ర్యాలీకి హాజరయ్యారు మోదీ. హిందుత్వ సిద్ధాంతకర్త వినాయక్​ దామోదర్ సావర్కర్​ విలువలను కొనియాడారు.

అకోలాలో ర్యాలీలో మాట్లాడుతున్న మోదీ

"కొంతమంది నేతలు వీర్​ సావర్కర్​పై దుష్ప్రచారం చేస్తున్నారు. అవమానిస్తున్నారు. సావర్కర్​ విలువల ఆధారంగానే జాతీయవాదాన్ని దేశ నిర్మాణానికి పునాదులుగా చేశాం. "
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి.

సావర్కర్​కు భారత రత్న ఇవ్వాలని మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది అధికార భాజపా. ఈ హామీని ప్రత్యర్థి పార్టీలు తప్పుబట్టాయి. ఆ విమర్శలను తిప్పికొడుతూ ర్యాలీలో సావర్కర్​ను ప్రస్తావించారు మోదీ.

మహారాష్ట్రలో ఒకప్పుడు తరచూ ఉగ్రవాద ఘటనలు జరుగుతుండేవన్నారు మోదీ. అందుకు బాధ్యులైన వారు దేశం వీడి పారిపోయి విదేశాల్లో తలదాచుకుంటున్నారని చెప్పారు. ఆ సమయంలో అధికారంలో ఎవరు ఉన్నారో గుర్తు చేసుకోవాలని ప్రజలకు సూచించారు మోదీ. వారంతా ఎలా తప్పించుకున్నారని ప్రశ్నించారు.

ఇదీ చూడండి: అతి త్వరలో మోదీ-ఇమ్రాన్​ భేటీ..!

Last Updated : Oct 16, 2019, 3:27 PM IST

ABOUT THE AUTHOR

...view details