తెలంగాణ

telangana

By

Published : Jan 8, 2020, 1:51 PM IST

Updated : Jan 8, 2020, 4:40 PM IST

ETV Bharat / bharat

'సజీవ సమాధి'తో రాజధాని రైతుల నిరసన

రాజస్థాన్​ రాజధాని జైపుర్​ రైతులు నిరసన బాట పట్టారు. మెడ లోతు వరకు భూమిలో శరీరాలను పాతిపెట్టుకుని రాత్రంతా గజగజ వణికే చలిలోనూ ఆందోళన కొనసాగించారు. గృహ నిర్మాణ పథకం కోసం ప్రభుత్వం సేకరిస్తోన్న భూమికి నూతన భూసేకరణ చట్టం కింద పరిహారం చెల్లించాలని డిమాండ్​ చేశారు.

satyagrah of farmers in jaipur of rajasthan
'సజీవ సమాధి'తో రాజధాని రైతుల నిరసన

'సజీవ సమాధి'తో రాజధాని రైతుల నిరసన

భూసేకరణకు వ్యతిరేకంగా రాజస్థాన్​ రాజధాని జైపుర్​ రైతులు వినూత్న పద్ధతిలో నిరసన చేపట్టారు. మంగళవారం భూమిలో మెడ లోతు గోతులు తవ్వుకుని సజీవంగా తమ శరీరాలను పాతిపెట్టుకున్నారు. వణికించే చలిలోనూ రాత్రంతా అలానే ఉన్నారు. యువ సంఘర్ష్​ సమితి ఛైర్మన్​ డాక్టర్​ నాగేంద్ర సింగ్​ షెకావత్​ ఈ ఆందోళనలకు నేతృత్వం వహిస్తున్నారు.

డిమాండ్​

జైపుర్​ శివార్లలోని నిండార్​లో​ గృహ నిర్మాణ​ పథకం కోసం జైపుర్​ అభివృద్ధి ప్రాధికార సంస్థ-జేడీఏ రైతుల నుంచి 1300 బీగాల భూమిని సేకరిస్తోంది. అయితే.... తమకు నూతన భూసేకరణ చట్టం కింద పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేస్తున్నారు రైతులు. అంతవరకు భూ సేకరణను అడ్డుకుంటామని తెలిపారు. నూతన భూ సేకరణ చట్టం కేంద్రం అమలు చేసినప్పటికీ జేడీఏ పాత భూ సేకరణ చట్టం కింద పరిహారం చెల్లిస్తుందని రైతులు ఆరోపించారు.

నిరసనలు చేస్తోన్న రైతులకు మద్దతు ప్రకటించారు రాజస్థాన్​ భాజపా అధ్యక్షుడు సతీష్​ పునియా. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్​పై విమర్శనాస్త్రాలు సంధించారు.

ఇదీ చూడండి : కశ్మీర్​కు మరోసారి విదేశీ ప్రతినిధుల బృందం

Last Updated : Jan 8, 2020, 4:40 PM IST

ABOUT THE AUTHOR

...view details